హృదయం ఉన్నవాళ్లను సంఘం దూషిస్తుంది .
సంఘం కోరేది , మానవుడి ఆనందం , క్షేమం కావు . అది కోరేది నమ్రతా , విలువలు .
మనకి లేని అనుభవం , ఆనందం ఇతరులకెందుకు ? అనుకొని సంఘం వాటి వినాశనానికి దారితీసే ద్వారబంధాలని నిర్మాణం చేస్తుంది .
పాపం సంఘాన్ని దూషించడం ఎందుకూ ? సంఘం ఏం చేసింది ?
కాస్తా -- నా సుఖాన్ని ఆనందాన్ని , వీటిని గురించి ఆలోచించడం మానుకొని , కొంచెం వీటిని త్యాగం చేస్తివా , ఇతరులు కూడా హాయిగా ఉంటారు --- కాబట్టి , నే పెట్టిన నియమాలని అతిక్రమించకుండా జాగ్రత్తగా నడుచుకోమంటుంది సంఘం .
" నీ ఇష్టం , నీతి అనుకో , సంప్రదాయమనుకో , నీకు సంఘం లో ఉన్నంతవరకూ వీటితో నిమిత్తం తప్పదు పిచ్చివాడా " అంటుంది .
NRB
No comments:
Post a Comment