బస్తీ లలో మనుష్యులు , ఇంచుమించు అందరూ ఒకలాంటి దుస్తులే ధరించి , ఒకలాగే మాట్లాడి , ఒకే మాదిరిగానే ఆలోచిస్తారు .
పారిశ్రామిక నాగరికత , ఉద్యోగంలో పోటీ , అందరి మనస్తత్వాలనీ , నైతిక పద్ధతులనీ , సాఫీ చేసి , ఒకేలా ఉండేటట్లు చేస్తుంది .
డెమోక్రసి జనం అంతా భిన్నమైన , అభిరుచులు, ఆశయాలు, లేకపోవడాన్నే కోరుతుంది.
దాని ఉనికికి అది అవసరం.
జీవితాన్ని పరిశీలించాలన్న వాడు పట్నంలో వెదుక్కోవాల్సిన అనుభవాలేమీ లేవేమో ననిపిస్తుంది .
పల్లెటూళ్ళో వ్యక్తులు కొంత సహజంగా వుంటారు . వెరైటీ వుంటుంది .
ప్రతి చిన్న చేష్టా , మామూలు మాటా , కొత్త అర్థాన్ని , కొత్త వెలుగునీ తెచ్చుకొంటుంది
అల్ప విషయాలన్నీ నూతనంగా తోస్తాయి .
పట్నవాసాలకి , పల్లెలకీ , యంత్రాలకీ , హృదయాలకీ పారిశ్రామిక నాగరికతకీ , పాడిపంటతో నిండిన నెమ్మది వ్యవసాయానికీ దేశంలో , అన్ని దేశాలలోనూ జరిగే మహాసంగ్రామం ఇది .
ఇందులో ఏది మంచిదో నిర్ణయించలేం .
అసలీ సమస్యలు తార్కిక బుద్ధితో తీరవు .
శరీరంతో తాకి , హృదయంతో అనుభవించి నాళాలపై రుజువు చేసుకోవాలి .
NRB
No comments:
Post a Comment