Friday, 1 May 2020

దయానిధి ఫిలాసఫీ-1

అంతా , అందరూ  రక్తంతో  ఏకమై పోయారు .  సృష్టి   అంతమొందేవరకు    వరదలై  మానవ రక్తం   ప్రవహిస్తూ    అందర్నీ   బంధించి ,  ఏకం చేసిన  మృత్యువుకి                అతీతమై పోతుంది . అదే కాబోలు అమరత్వం  అంటే . 


దేన్ని ధ్యానం  చేస్తే  అది  ఐపోతావని హిందూ ఫిలాసఫీ చెపుతోంది  .  భక్తుడు ప్రార్థన వల్ల  దైవత్వం పొందుతాడు. 


 మంచివాళ్ళు తమకి  తెలీకుండా  హానిచేస్తారు . 


అనుకోవడానికి , ఆచరించడానికి మధ్య చాలా దూరముంది .  ఒక పర్వత శిఖరం మీదనుంచి , మరో దేశంలో వున్నా పర్వత శిఖరం మీదకు దూకడం లాంటిది .. 


పరిపూర్ణ  జ్ఞానంతో విముఖత పొందిన అమాయకత్వం  కొందరిది . 


తమ గుణాలని ఇతురులలో చూడడం మానవ నైజం . తమకిష్టమైన  వాళ్ళందరూ మంచివాళ్ళు , ఇష్టం లేని  వాళ్ళందరూ చెడ్డవాళ్ళు .. 


మనుషుల   శీలాన్ని బట్టి  గుణాలని బట్టి  మనము ఆదరించాలని పెద్దలు చెపుతారు . కానీ నిజంగా  మనం చూసేది  ఇది కాదు . మనుషుల వాలకం , వైఖరి  యివే యిష్టాలు నిర్ణయించేవి . 

                                                                                                                                    NRB 

No comments:

Post a Comment

ఇదో ఫిలాసఫీ

హిందూదేశంలో  వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం  చుట్టకాదండోయ్ !                        చుట్ట వార్ధక్యానికి  చిహ్నం , వార్ధక్యం  వేదాంతాలకి  చ...