చివరకు మిగిలేది - ఏమిటి ?
అన్నదానికి వెంటనే దేని చివరకు ? అన్న ప్రశ్న పుడుతుంది
ఆ వెంటనే మిగిలేది ఎవరికి ? అన్న జిజ్ఞాసా రాక తప్పదు ..
వ్యక్తికా - జీవితానికా - వ్యక్తులతోను వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పత్తి, పునరుత్పత్తి సంభంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా - అన్నదే అది .
ఈ ప్రశ్న భావనామయమైంది .
దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా ?
అసలీ " మిగలటం " అన్న సమస్య గురించి విశ్వనాథ వేయిపడగలలో చర్చించాడు అలాగే చలం తన " మ్యూజింగ్స్ " లో కొంత ఆలోచన చేసాడు
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే.......
మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేసాడు చలం
వీరి తాత్విక విశ్వాసాలకు సృజనాత్మక రూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది .
ఈ బ్లాగ్ లో మీరు చదివేది , చివరకు మిగిలేది నవలలోని కొన్ని తాత్విక విశ్వాసాలు
NRB
No comments:
Post a Comment