Friday, 8 May 2020

సంఘం - 2


నిజంగా ఎవరూ , ఎవరికీ   కారు .  మనిషికీ మనిషికీ మధ్య గోడలు లేచి  వున్నాయి .  

అవతల్నించి  మనం మాట్లాడే మాటలు  వింటారు .   మన చేష్టల్ని చూస్తారు .  

" ఆ మాటలు  మాట్లాడిని  వ్యక్తి ఆ సమయంలో అట్లాగే చేస్తాడు "  అని సంఘం  నిర్ణయించుకొని  వాడ్ని తక్కెట్లో తూచి  బరువు కట్టేసి  వాడితో నిమిత్తం వదులుకుంటుంది .  

నూటికి   తొంభై తొమ్మిది  మార్లు , వాళ్ళు అనుకున్నట్లుగానే  ఆ మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు .  సంఘం కట్టిన  విలువ సరైనదని  రుజువైపోతుంది .  అందుకనే  తన నియమాల్ని  అందరూ పాటించేటట్లు  చేసుకొనే బలం  సంఘానికి ఉంది .  అందుకే సంఘం అంటే కొంత మందికి  అంత భయం .   


మనిషికీ  మనిషికీ  మధ్యలోనే కాదు గొడవలుండటం , ప్రతి మనిషి లోనూ ఒక తెర  వుంటుంది .      అ తెర  వూడిపోకుండా  " సంఘం " కాపలా కాస్తుంది .. 


పగటి పూట  , మామూలు సమయాలలో విస్త్రీ  మడతలా  ఆ  తెర  బాగానే  వుంటుంది . కానీ రాత్రిఎప్పుడో , చీకట్లు అనంతాన్ని పెల్లగించుకొని  ఆత్మని ఆవరించుకొన్నప్పుడో , ఎప్పుడో , ఎందుకో , ఆ తెర వూడిపోతుంది . 


పిచ్చాస్పత్రులలో  ఉన్న వాళ్ళందరూ, ఈ  "తెరలు "  వూడి పోయిన వాళ్ళూను , కొంచం చిరిగిపోయిన వాళ్ళూనూ . 


ఇతరుల  మనస్తత్వాలను తెలుసుకోడంలో  మనం చూపించే శ్రద్ధ , వోర్పు , తెలివి , మనల్ని మనం తెలుసుకోవడంలో  ఉపయోగిస్తే  యెంత బాగుండును , లేక ఏదో శక్తిని  సంపాదించుకోవటం  కోసం, వున్న  నాలుగు శక్తుల్నీ  దుర్విని యోగం చేసి , చంపుకొనేటట్లు , సంఘం  తర్ఫీదు చేస్తుంది ..


                                                                                                                                         NRB                                                                                                                                                                

No comments:

Post a Comment

ఇదో ఫిలాసఫీ

హిందూదేశంలో  వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం  చుట్టకాదండోయ్ !                        చుట్ట వార్ధక్యానికి  చిహ్నం , వార్ధక్యం  వేదాంతాలకి  చ...