" పెళ్లి - అందరికీ పెళ్లి , ఆడది పుట్టగానే పెళ్లి ; పెళ్లి కానీ మొగాడికి సంఘంలో చోటు లేదు . మొగాడ్ని ఒంటరిగా వుండనివ్వరు " స్త్రీలు వేటాడతారు ; బ్రహ్మచర్యం కాగానే , సంసార జీవితాన్ని వేదాంతులు శాసించారు .
పెళ్లి కాని మొగాళ్ళు అక్కడక్కడ వుండచ్చు ; కానీ ఆడాళ్ళు ఉండకూడదు . అలా ఉండాలనుకొన్న వాళ్ళు -- నామకహ ఒకర్ని చేసుకొని , కావాలంటే తరువాత వాణ్ని వదిలేసో , ..... ఒంటిగా ఉండాల్సిందే .
అసలు ఏ వ్యక్తికీ పెళ్లంటే ఏమిటో తెలీదు . అంతా సంఘం నేర్పింది . ఆ సంకెళ్లు తగిలించి మళ్ళా వాటిని వొదిలించుకోమని , వేదాంతం అడుగుతుంది .
పెళ్లి ఒక పద్మవ్యూహం --- బైట వాళ్ళు లోపలి వెళ్లాలని , లోపలి వాళ్ళు బైటకి రావాలని ఉబలాటపడటం .
NRB
No comments:
Post a Comment