పుష్పించని మొక్క , ఫలించని ప్రేమ , సిద్దించని ఆశయం , యదార్థం కాని కల , ఇవి ఆశాజ్యోతిని ఆరకుండా చూస్తాయి
అందరూ ఏమనుకొంటారో అని భయపడే వాళ్ళు ; ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉండరు . మన ప్రవర్తన మనకి నచ్చాలిగాని ఊళ్ళో వాళ్లేమనుకొంటే మనకెందుకు ?
ఎవరో , ఎప్పుడో సహాయపడతారన్న ఆశ వున్న మనుషులే భయపడేది . ఎవరూ లేరు , ఎప్పుడూ రారు --- అని నిర్ధారణ జరిగిపోయి ఏకాకి అవగానే , భయం పోతుంది . తాను ఒక్కడే తనకోసం జీవించి ఈ శక్తులను ఎదుర్కోవాలి . స్నేహితులు , బంధువులు , గురువులు , గ్రంథాలు, సలహాలు, వేదాంతాలు -- అన్నీ కడసారి యథార్థాన్ని యెదుర్కొన్నప్పుడు వృథా , అదే కొత్త బలం , నూతన వికాసం . అది మొండి -- గుడ్డి ధైర్యం కాదు . ఇంద్రియాలన్నింటినీ ఏకగ్రీవంగా జీవింపచేసి ,సర్వశక్తుల్నీ ఖంజాయింపు జేసుకొని , మూడో నేత్రం తెరుచుకొని ఒక్కసారిగా , చెలరేగిన సాహసం అది .
అన్ని శక్తుల్నీ తనలో కలుపుకొని దహింపచేసే ఒక జ్వాల స్త్రీ . సంప్రదాయాలు , ఆచారాలు , నైతికవిలువలు ,కట్టుబాట్లు -- అన్నింటినీ ముంచెత్తి వేసే మహాసముద్రం లోని అఘాతం . అందుకనే లోపలి కెళ్ళడమంటే అంత భయం .
NRB
No comments:
Post a Comment