హిందూదేశంలో వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం చుట్టకాదండోయ్ ! చుట్ట వార్ధక్యానికి చిహ్నం , వార్ధక్యం వేదాంతాలకి చిహ్నం . యవ్వనానికీ , వేదాంతానికి అతగదు, అతికించడం కొంతవరకూ సిగరెట్టు చేయగలదేమో .
స్కూల్ లో చదువుకొనే రోజుల్లో 3 x 0 , సమాధానం " 0" అని ఒప్పుకోలేని వాళ్లంతా అదోరకం వేదాంతులే.
పదార్థానికి నశింపంటూ లేదుకదా , దాన్ని సున్నతో గుణిస్తే , సున్నగా నశింపు కావడం , సృష్టికే వ్యతిరేకమని వారి వాదనేమో .
వేదాంతం దృష్టిలో , దేశమంటూ లేదు -- " విశ్వమే నా దేశం "
వేదాంతులు కొన్ని సమస్యలని బాగా విశదంగా పరిశీలించగలరు . ప్రతి దానికి పునాదులు త్రవ్వి , పేకముక్కలతో కట్టిన తార్కిక భవనాలను కూలదోస్తారు .
వివాహం చేసుకుంటే భావస్వాతంత్య్రం పోతుందని భయపడి బ్రహ్మచారి గానే ఉంటారు కొందరు వేదాంతులు .
మానవుడి అథోగతికి కారణ భూతాలయిన శక్తులపై విప్లవం చేసి నశింపు చేయకుండా పురుషుడిని , వోస్త్రీకి కట్టిపడేసి , వివాహం అనే జైలులో బంధిస్తుంది నాగరికత అని వీరి అభిప్రాయం
NRB