Saturday, 2 May 2020

స్త్రీ హృదయం


రహస్యాలంటే   స్త్రీలకు  గిట్టదు  . 


స్త్రీ  హృదయం  ఒక రహస్య మందిరం.  దాన్ని పురుషుడు   తెలుసుకోనంతకాలమూ .


స్త్రీ  పురుష  వ్యత్యాసాలుండాల్సిందే  అనుకునే  సనాతనులు భ్రమపడుతున్నారు  .. ఆ  రహస్యం అంతా  ఊహకి దాసులైన సౌందర్య పిపాసులు  కల్పించిందే , కానీ వారిలో ఏ రహస్యం లేకపోవడం  సరిగదా  సృష్టిలో  వారి కర్థం  కాని   రహస్యాలతో  అసలు  మానవునికే    లేనట్టుగా  స్త్రీలు ప్రవర్తిస్తూంటారు 

గుప్పెట్లో  గాలిని దాచి  " ఇదేమిటో చెప్పుకో " అంటే పురుషుడు  " కొంతవ్యవధి నివ్వండి  ఆలోచించి చెబుతాను  " అంటాడు .  స్త్రీ  గుప్పెటని రక్కేసి  వేళ్ళని బలవంతంగా   తీరా చూసి   " ఓస్   ఇంతే , నాకక్కర్లేదు " పొమ్మంటుంది . 


ప్రపంచం పురుషుడికి  చెందుతుంది --  దాన్ని శోధించి అర్థం చేసుకోవాలి , కానీ  ఏం  లాభం  ?  పురుషుడు  స్త్రీకి  చెందుతాడు , అంచేత  ప్రపంచ  రహస్యంతో  స్త్రీకేం  నిమిత్తం ? 

                                                                                                                                       NRB

No comments:

Post a Comment

ఇదో ఫిలాసఫీ

హిందూదేశంలో  వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం  చుట్టకాదండోయ్ !                        చుట్ట వార్ధక్యానికి  చిహ్నం , వార్ధక్యం  వేదాంతాలకి  చ...