భావాలు విచిత్రమైనవి .
మన సొంత భావాలు , ఎవరివోలా కనిపిస్తాయి . ఎవరో చెప్పినవి మనసొంతంలా కనిపిస్తాయి .
నిజంగా కొత్తభావాలంటూ లేవు . ఆకలి , నిద్ర , దాహం, ఆకర్షణ, అసంతృప్తి , జీవితంపై మమకారం --- అందరికీ ఇవి సమానమే . కొత్తవి ఎట్లా వస్తాయి ?
భావాలు మానవులందరినీ ఏకం చేస్తాయి . వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు , మానవుల్ని విడదీస్తాయి .
ప్రాణంపై తీపి తీసుకోండి , చావడానికి ఎవరూ ఇష్టపడరు . చచ్చిపోయింతర్వాత కూడా బ్రతకాలాన్నంత తీపి.... దానికోసం , మరో లోకం, స్వర్గం , స్వర్గానికి అధిపతి , ఆత్మ అక్కడికి చక్కాపోయి , శాశ్వతంగా ఉండడమో , లేకపోతే మళ్ళా కొన్ని జన్మములు ఎత్తి ---- మానవ జన్మమే ఎత్తాలి. మళ్లా --- ఆత్మని శుద్ధం చేసుకొని, మళ్ళా పైకి పోయి పరమాత్మలో ఐక్యం కావడం , ఇన్నిటిని కల్పించుకుంది జీవితంపై మమకారం . అంతే కాదు . ఈ జీవితం అంతా అసత్యం , శరీరం మాయ, బ్రతుకు కల , పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడం సత్యం , అని నమ్మమని చంపుకుతింటుంది ఈ మమకారం ..
ఈ మతాలూ , ఈ దేవుళ్ళు , ఈ ఆదర్శాలు , భాష కల్పించినవే కదా పాపం . ఈ భావాలే యదార్థాలని నమ్మి తృప్తి పడతారు అమాయకపు మానవులు.
అనంతం నుంచి ప్రళయంలో ఉద్భవించి మూగదైపోయిన ప్రపంచం రొద ఈ కంఠధ్వని -- ఆకలి , ఆలోచన ---
NRB
No comments:
Post a Comment